జీడీపీ ఎత్తు పెంచితే భూములు ఇవ్వం

ABN , First Publish Date - 2021-11-23T05:40:56+05:30 IST

గాజులదిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచేటట్లయితే తమ భూములు ఇవ్వబోమని గంజహళ్లి, బెల్లదొడ్డి, ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, నెరుడుప్పల ఆయకట్టు భూముల రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు.

జీడీపీ ఎత్తు పెంచితే భూములు ఇవ్వం

  1. కలెక్టర్‌కు తెలియజేసిన ఆయకట్టు రైతులు 


గోనెగండ్ల, నవంబరు 22: గాజులదిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచేటట్లయితే తమ భూములు ఇవ్వబోమని గంజహళ్లి, బెల్లదొడ్డి, ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, నెరుడుప్పల ఆయకట్టు భూముల రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. వారు సోమవారం కర్నూలు కలెక్టర్‌ను కలసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు నజీర్‌సాహెబ్‌ మాట్లాడుతూ 1970లో గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ గ్రామాలకు చెందిన 3వేల ఎకరాలను ఇచ్చామన్నారు. దానికి పరిహారం కింద ప్రభుత్వం రూ.500 నుంచి రూ.1000 వరకు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. ఈ ఐదు గ్రామాల రైతులు మిగిలిన  150 నుంచి 200 ఎకరాలలో పంటలు పండించుకొని జీవిస్తున్నారని అన్నారు. మళ్లీ ఆనకట్ట ఎత్తు పెంచితే ఈ భూములు ముంపునకు గురవుతాయని అన్నారు. కాబట్టి  ప్రభుత్వం ఆనకట్ట పెంచేటట్లయితే భూములు ఇవ్వబోమని అన్నారు. అలాగే జీవో నెం 98 ప్రకారం నిర్వాసితుల్లో ప్రతి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-11-23T05:40:56+05:30 IST