అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-05-22T05:22:19+05:30 IST

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు.

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

పత్తికొండ, మే 21: కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పత్తికొండ మైత్రి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆధార్‌కార్డు ఆధారంగా ఆసుపత్రిలో పేరు రాసుకుని ఆమె చిక్సిత అందించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందారు. మహిళ ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తులు అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆమె ఆధార్‌కార్డు ఆధారంగా మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన మహిళగా సిబ్బంది గుర్తించారు. పెరవలి గ్రామానికి సంబంఽధించి కొందరికి పోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా సంబంధిత మహిళది పెరవలి స్వగ్రామం కాదని, 10ఏళ్ల క్రితం పెరవలికి వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్నారని ఆ మహిళ బంధువులు కూడా ఇంటికి తాళం వేసి ఉన్నారని తెలియజేశారు. విషయం తెలుసుకున్న మైతిర ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వాహుడు రామ్మోహన్‌ సొంత ఖర్చులతో మహిళ మృతదేహానికి  అంత్యకియ్రలు నిర్వహించారు.


Updated Date - 2021-05-22T05:22:19+05:30 IST