అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-05-09T04:52:07+05:30 IST

మండలంలోని పోలకల్‌ గ్రామంలో గతవారం రోజుల నుంచి ఒక అనాఽథ వ్యక్తి భిక్షాటన చేస్తూ సత్రంలో తలదాచుకుంటున్నారు.

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

సి.బెళగల్‌, మే 8: మండలంలోని పోలకల్‌ గ్రామంలో గతవారం రోజుల నుంచి ఒక అనాఽథ వ్యక్తి భిక్షాటన చేస్తూ సత్రంలో తలదాచుకుంటున్నారు. అయితే శనివారం ఉదయం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న కాలువలు పడిమృతి చెందినట్లు పోలకల్‌ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ శివాంజల్‌ అక్కడి చేరుకుని మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. అనాథ వ్యక్తిగా గుర్తించి కేసునమోదు చెసుకుని పోస్టుమార్టం చేయించారు. అనంతరం సి.బెళగల్‌ కొండ సమీపంలో ఖననం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-05-09T04:52:07+05:30 IST