రేపటి నుంచి రెండో దశ

ABN , First Publish Date - 2021-02-01T06:04:13+05:30 IST

రెండో దశ ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలౌతుంది.

రేపటి నుంచి రెండో దశ

  1. 240 పంచాయతీలకు ఎన్నికలు
  2. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు


కర్నూలు (కలెక్టరేట్‌) జనవరి 31: రెండో దశ ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలౌతుంది. మొత్తం 13 మండలాల్లో 240 గ్రామ పంచాయతీలు, 2,482 వార్డులకు 2,578 ఎన్నికలు నిర్వహిస్తారు. 2వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్టేజ్‌వన్‌ ఆర్వోలు స్వీకరిస్తారు. నామినేషన్లు వేసేందుకు 4వ తేదీ వరకు గడువు ఉంటుంది. 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుంది. నంద్యాల, కర్నూలు డివిజన్లలో 13 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. నంద్యాల డివిజన్‌లో బనగానపల్లె, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, గడివేముల, పాణ్యం, కర్నూలు డివిజన్‌లో కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కోడుమూరు, కర్నూలు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి


రెండో విడత షెడ్యూల్‌

నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 2

తుది గడువు: ఫిబ్రవరి 4

నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 5(ఉదయం 8 గంటల నుంచి)

అభ్యంతరాల స్వీకరణ: ఫిబ్రవరి 6

అభ్యంతరాలపై నిర్ణయం: ఫిబ్రవరి 7

నామినేషన్ల ఉపసంహరణ,  జాబితా ప్రచురణ:   ఫిబ్రవరి 8

పోలింగ్‌  ఫిబ్రవరి 13

ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 13 

(మధ్యాహ్నం 4 గంటల నుంచి)

Updated Date - 2021-02-01T06:04:13+05:30 IST