ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-10-30T04:43:11+05:30 IST
సారా అమ్ముతున్న ముగ్గురు మహిళలు, కర్ణాటక మద్యం తరలిస్తూ ఇద్దరిని ఇస్వీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆదోని రూరల్, అక్టోబరు 29: సారా అమ్ముతున్న ముగ్గురు మహిళలు, కర్ణాటక మద్యం తరలిస్తూ ఇద్దరిని ఇస్వీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నహరివానం గ్రామానికి చెందిన నరసింహులు, బోయ దేవేంద్రను అదుపులోకి తీసుకొని 196 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బసాపురం గ్రామానికి చెందిన పెద్దపార్వతిని, చిన్నపార్వతి, ఎరుకుల సుంకమ్మను అదుపులోకి తీసుకొని పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.