చెత్త బైకుపై పడిందని..

ABN , First Publish Date - 2021-01-14T05:14:32+05:30 IST

మండలంలోని రేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

చెత్త బైకుపై పడిందని..

కోవెలకుంట్ల, జనవరి 13: మండలంలోని రేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. రేవనూరు గ్రామానికి చెందిన ఆల్వకొండ జయపతి అనే మహిళ ఇంటి ముందు చెత్తను ఊడుస్తుండగా ఆ చెత్త తమ బైకుపై పడిందని కోనేటి జయమ్మ వాదనకు దిగారు. దీంతో ఆల్వకొండ జయపతి, ఆమె కుమారుడు మద్దిలేటి కలిసి కోనేటి జయమ్మ, ఆమె కుమారుడు కుమార్‌పై కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయన్నారు. కుమార్‌ ఫిర్యాదు మేరకు జయపతి, మద్దిలేటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-14T05:14:32+05:30 IST