రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-11-03T05:23:24+05:30 IST

మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి, కౌతాళం, మంత్రాలయం నదితీర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

రైతులను ఆదుకోవాలి

మంత్రాలయం, నవంబరు 2: మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి, కౌతాళం, మంత్రాలయం నదితీర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ  మూడు రోజుల క్రితం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి వరి, మిరప, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. చేతికి వచ్చే దశలో వరి, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. మిరప పంటకు సోకిన వైరస్‌ను శాస్త్రవేత్తలతో అంచనా వేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-03T05:23:24+05:30 IST