తోటలను దున్నేస్తున్న రైతులు

ABN , First Publish Date - 2021-12-30T05:46:01+05:30 IST

అరటికి ధర లేకపోవడంతో రైతులు తోటలను దున్నేస్తున్నారు.

తోటలను దున్నేస్తున్న  రైతులు
అరటి తోటలను దున్నేస్తున్న రైతు

  1. రూ.6 లక్షలు నష్టం 


 చాగలమర్రి, డిసెంబరు 29: అరటికి ధర లేకపోవడంతో రైతులు తోటలను దున్నేస్తున్నారు. బుధవారం చాగలమర్రి గ్రామంలో కృష్ణ అనే కౌలు రైతు 6 ఎకరాల అరటితోటను దున్నేశారు. గత ఏడాది టన్ను అరటి రూ.18 వేలు పలికిందని, ఈ ఏడాది టన్ను రూ.1,200 కూడా పలకడం లేదని కౌలు రైతు ఆవేదన  వ్యక్తం చేశారు. రూ.6 లక్షల దాకా పెట్టుబడి రూపంలో నష్టం వాటిల్లింది. వైరస్‌ సోకి ధరలు లేక నష్టపోయామని, ప్రభుత్వమే పరిహారం అం దించి ఆదుకోవాలని కోరారు. Updated Date - 2021-12-30T05:46:01+05:30 IST