రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-22T05:16:39+05:30 IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన బోయ ఉరుకుందు(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

రైతు ఆత్మహత్య

మంత్రాలయం, అక్టోబరు 21: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన బోయ ఉరుకుందు(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, బంధువల వివరాల మేరకు.. బోయ ఉరుకుందు తనకున్న మూడు ఎకరాలలో పత్తి, మిరప సాగు చేశారు. సాగుకోసం చేసిన అప్పు రూ. 6లక్షలకు పేరుకుని పోయింది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య మృతిచెందింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉరుకుందు మూడు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోచక గురువారం ఉదయం కుమారుడిని పాఠశాలకు పంపి పురుగులమందు తాగారు. ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్సనిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఉరుకుందు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంత్రాలయం ఎస్‌ఐ వేణుగోపాలరాజు తెలిపారు. 

Updated Date - 2021-10-22T05:16:39+05:30 IST