అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-30T05:54:13+05:30 IST

కష్టించి పంట సాగు చేసినా అప్పులు తీరే దారి కనిపించలేదు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పాములపాడు డిసెంబరు 29: కష్టించి పంట సాగు చేసినా అప్పులు తీరే దారి కనిపించలేదు. అధిక వర్షాలు, విపరీతమైన తెగుళ్ల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. సాగుకు  తెచ్చిన అప్పులు తీర్చలేననే మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కౌలు  రైతు వెంకటరమణ (38) తన ఇంటిలోనే  ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మండలంలో నెలకొంది. చెళిమిళ్ళ గ్రామానికి చెందిన వెంకటరమణ ఐదు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని ఈ సంవత్సరం ఖరీ్‌ఫలో మొక్కజొన్న సాగు చేశాడు. అధిక వర్షాల వల్ల పంట పూర్తిగా నష్టపోయింది. రబీలో సాగు చేసిన మినుము పంట పచ్చతెగుళ్ళు సోకి దెబ్బతిని పోయింది.  వేల రూపాయలు వెచ్చించి పురుగు మందులు పిచికారి చేసిన పంట దక్కలేదు. సాగుకు చేసిన 5 లక్షల రూపాయల అప్పు తీర్చలేననే ఆందోళన కలిగింది. దీంతో  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య లీలావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.  పాములపాడు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకున్నాడు. 



Updated Date - 2021-12-30T05:54:13+05:30 IST