అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-01T04:54:21+05:30 IST

మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామానికి చెందిన కురువ బజారప్ప కుమారుడు కురువ శివన్న (32) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మంత్రాలయం, డిసెంబరు 31:మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామానికి చెందిన కురువ బజారప్ప కుమారుడు కురువ శివన్న (32) అనే  రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం  జరిగింది.   శివన్నకు రెండెకరాల సొంత భూమి ఉంది.  మరో పదెకరాల పొలాన్ని  కౌలుకు తీసుకుని పత్తి  సాగు చేశాడు.  ఈ క్రమంలో  రూ.8లక్షలు అప్పు చేశాడు.   అప్పు చేసి ఒక ట్రాక్టరు కూడా కొన్నాడు.  ఈ ఏడాది  పత్తి పంట చేతికంద లేదు. అప్పులు తీర్చే దారి కనిపించక   శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.   ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ   రైతు మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, మల్లికార్జున  ఉన్నారు.   మంత్రాలయం ఎస్‌ఐ వేణుగోపాల రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-01T04:54:21+05:30 IST