అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-02T05:41:38+05:30 IST

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


డోన్‌(రూరల్‌), మే 1:
అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని కొచ్చెర్వు గ్రామానికి చెందిన మేకల నాయుడు (50) తనకున్న ఐదెకరాల్లో గత మూడు సంవత్సరాలుగా కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేశాడు. దిగుబడులు సరిగా రాక తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దిక్కుతోచని స్థితిలో గ్రామ సమీపంలోని తన పొలం పరిసర ప్రాంతంలో ఉన్న చెట్టుకు శనివారం ఉరి వేసుకున్నాడు. మేకల నాయుడుకు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పంటల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు పైగా ఉంటాయని బంధువులు తెలిపారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-02T05:41:38+05:30 IST