రైతు దగా దినోత్సవం: టీడీపీ

ABN , First Publish Date - 2021-07-09T04:41:08+05:30 IST

రైతు దినోత్సవం కాదని ఇది రైతు దగా దినోత్సవమని టీడీపీ జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి అన్నారు.

రైతు దగా దినోత్సవం: టీడీపీ
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి

ఆదోని, జూలై 8: రైతు దినోత్సవం కాదని ఇది రైతు దగా దినోత్సవమని టీడీపీ జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి అన్నారు. గురువారం అమరావతి నగర్‌ పొలాల్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్‌చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం సగటున 11 శాతం వృద్ధి సాధించగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉండగా రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్‌రెడ్డికి లేదని అన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌లో నిర్లక్ష్యంతో 80 శాతం మంది రైతులు నష్టపోతున్నారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపుతో రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేసి సాగు నీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌ పెంచాలని కృష్ణా, గోదావరి నీటి హక్కులను తాకట్టు పెట్టకుండా కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, ఫకృద్దీన్‌, శ్రీనివాసులు, కర్నూలు జిల్లా పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు శేషిరెడ్డి, బుద్దారెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి, దొడ్డనకేరి శివప్ప, మాజీ ఎంపీటీసీ నాగరాజు, బాలురాజు, మాజీ కౌన్సిలర్‌ తిమ్మప్ప, బాలాజీ, నల్లన్న, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, నాగరాజ్‌, వీరారెడ్డి, విరుపాక్షి, తాయప్ప, సోము, రామాంజి పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-09T04:41:08+05:30 IST