రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-21T05:10:15+05:30 IST
ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎల్.శేషయ్య (42) బుధవారం తెల్లవారుజామున తన పొలంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మకూరు రూరల్, అక్టోబరు 19 : ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎల్.శేషయ్య (42) బుధవారం తెల్లవారుజామున తన పొలంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు శేషయ్యను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందాడు. శేషయ్యకు పది ఎకరాల సొంత పొలం ఉంది. దానితో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. తిరిగి మినుము పంట వేశాడు. వర్షాభావం వల్ల అది కూడా చేతికి రాలేదు. దాదాపు 30 లక్షల మేర అప్పులయ్యాయి. అవి తీర్చేదారి లేక తీవ్ర మనస్తాపానాకి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని తమ్ముడు నాగేంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.