నందవరం ఆలయానికి పొలం విరాళం

ABN , First Publish Date - 2021-12-20T04:56:10+05:30 IST

నందవరం చౌడేశ్వరీమాత ఆలయానికి రూ.7.30లక్షల విలువ చేసే 1.80 ఎకరాల భూమిని వైఎ్‌సఆర్‌జిల్లా జమ్మలమడుగుకు చెందిన అవ్వా పెద్దసుబ్బారెడ్డి కుమారుడు అవ్వా వెంకటసురేశ కుమార్‌ రెడ్డి ఆదివారం ఆలయ ఈవో రామానుజనకు విరాళంగా అందించారు.

నందవరం ఆలయానికి పొలం విరాళం
యాగంటి ఆలయ చైర్మన బుచ్చిరెడ్డికి విరాళం అందిస్తున్న దాతలు

బనగానపల్లె, డిసెంబరు 19:  నందవరం చౌడేశ్వరీమాత ఆలయానికి రూ.7.30లక్షల విలువ చేసే 1.80 ఎకరాల భూమిని వైఎ్‌సఆర్‌జిల్లా జమ్మలమడుగుకు చెందిన అవ్వా పెద్దసుబ్బారెడ్డి కుమారుడు అవ్వా వెంకటసురేశ కుమార్‌ రెడ్డి ఆదివారం ఆలయ ఈవో రామానుజనకు విరాళంగా అందించారు. బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామంలో 3-4ఏ1 సర్వే నంబరులోని 1.80 సెంట్లను చౌడేశ్వరీమాతకు రిజిష్రేషన చేసి రిజిస్ట్రేషన పత్రాలను ఆలయ ఈవోకు అందించారు. కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్‌ నాయకుడు కప్పెటనాగేశ్వరరెడ్డి, ఆలయ పూజారులు పాల్గొన్నారు. ఈవో మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు.

 వెండి విగ్రహం విరాళం 

  మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరీమాతకు బెంగుళూరుకు చెందిన శ్రీకాంత, అనితా దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1.30 లక్షల విలువ చేసే వెండి చౌడేశ్వరీమాత అమ్మవారి విగ్రహం, 5 గ్రాముల బంగారు తాళిబొట్టును విరాళంగా ఆలయ ఈవో రామానుజనకు ఆదివారం అందించారు. అనంతరం దాతలు అమ్మవారి ఆలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు.  

ఫ  యాగంటి ఆలయాభివృద్ధికి పశుసంవర్దక శాఖ డిప్యూటీ చైర్మన రామచంద్రయ్య, పుష్పలత దంపతులు, వారి సోదరుడు డాక్టర్‌ కృష్ణయ్య డాక్టర్‌ జ్యోతి దంపతులు ఆదివార రూ.లక్ష  ఆదివారం ఆలయ చైర్మన తోట బుచ్చిరెడ్డికి విరాళం అందించారు. దాతలను ఆలయ చైర్మన సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు లోక్‌నాథశర్మ, పశువైద్యాధికారి శ్రీకాంతరెడ్డి, రామకృష్ణుడు, పెద్దనాగిరెడ్డి, శ్రీనివాసు లు, బసప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

  శ్రీశైలం: శ్రీశైలం దేవసాఽ్థనం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కు టీర నిర్మాణ పథకానికి విశాఖపట్నంకు చెందిన ఎస్‌. ఉమాదేవి అనే భక్తురాలు రూ. 5 లక్షల విరాళాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్నకు అందజేశారు. అలాగే గో సంరక్షణ నిధి పథకానికి కర్నూలు జిల్లా, నంద్యాలకు చెందిన వి. ప్రమీలాదేవి రూ. లక్ష విరా ళాన్ని, నిత్యాన్నదాన పఽథకానికి తాడేపల్లి గ్రామం, గుంటూరు జిల్లాకు చెందిన జి. రమాదేవి రూ. లక్ష విరాళాన్ని, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంకు చెందిన కె. విజయలక్ష్మీ రూ లక్ష విరాళాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు.   




Updated Date - 2021-12-20T04:56:10+05:30 IST