కరోనా నియంత్రణలో విఫలం
ABN , First Publish Date - 2021-05-05T05:44:03+05:30 IST
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె,
మే 4: కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో
మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వాల అసమర్థత వలన వేలాది మంది
ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో
సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నా రు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఉండకపోవడం, టీకాల పంపిణీ సరిగ్గా
చేయకపోవడం, బెడ్ల కొరత వలన నిత్యం రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని
అన్నారు. అవసరమైన చోట ఆకిజన్ నిల్వలు పెంచి, ప్రతి హాస్పిటల్‌లో
అందుబాటులో ఉంచాలన్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తామనే
ప్రకటనను అమలు చేయాలని కోరారు. ఇప్పటికి కేవలం 30 శాతం మందికి మాత్రమే
టీకాలు అందాయన్నారు. 18 ఏళ్లు పైబడిన వారికికూడా టీకాలు వేయాలన్నారు.