‘కార్మికులను ఆదుకోవడంలో విఫలం’

ABN , First Publish Date - 2021-06-22T05:22:49+05:30 IST

కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం మండల కార్యదర్శి కె.వెంకట్రాముడు విమర్శించారు.

‘కార్మికులను ఆదుకోవడంలో విఫలం’

కల్లూరు, జూన్‌ 21:  కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం మండల కార్యదర్శి కె.వెంకట్రాముడు విమర్శించారు. చెన్నమ్మ సర్కిల్‌లోని సూర్యనారాయణ భవన్‌లో పందిపాడు గ్రామ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ హమాలీ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం సోమవారం నిర్వహించారు. కార్మికులకు హాని కలిగించే ఆ నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులుగా డి.కృష్ణ, పి.శంకర్‌, ట్రెజరర్‌గా బాలచంద్రుడును ఎన్నుకున్నారు. 

Updated Date - 2021-06-22T05:22:49+05:30 IST