‘రైతులను ఆదుకోవడంలో విఫలం’

ABN , First Publish Date - 2021-07-09T04:52:12+05:30 IST

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు.

‘రైతులను ఆదుకోవడంలో విఫలం’

ఎమ్మిగనూరు, జూలై 8: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఎమ్మిగనూరులో విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో రైతన్నలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉండగా రైతు దినోత్సవాలను నిర్వహించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. రైతులకు వేల రూ.కోట్ల సాయం అందించామని తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు నిలయంగా మారాయని తెలిపారు. జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపుతో రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారన్నారు. అసలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్నారు. 

- గోనెగండ్ల: వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం దగ్గరలో ఉందని టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌ అన్నారు. గురువారం గోనెగండ్లలోని టీడీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సీనియర్‌ టీడీపీ నాయ కుడు మాజీ ఎంపీపీ గాజులదిన్నె హనుమంతు, జిల్లా టీడీపీ మైనార్టీ సెల్‌ నాయకులు బేతాళబడేసా, రామాంజినేయులు, తిరుపతయ్యనాయుడు, తెలుగు రైతు మండల అధ్యక్షుడు గాజులదిన్నె సంజన్న, టీడీపీ ఉపాధ్యక్షుడు కులుమాల రాముడు, దరగల మాబు, చెన్నలరాయుడు, కొత్తింటి ఫకృద్దీన్‌, అక్బర్‌, కాంతస్వామి, పూజారి రంగస్వామి, యాకోబు, ఎస్‌ఎన్‌ మాబువలి, రాముడు తదితరులు పాల్గొన్నారు.  

 -నందవరం: మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ కన్వీనర్‌ చిన్నరాముడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి మాధవరావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు. కాశీంవలి, పెద్ద రాముడు, టి.ఈరన్న, షరీఫ్‌, లక్ష్మన్న, విశ్వనాథ్‌, బ్రహ్మానందరెడ్డి, గజేంద్రరెడ్డి, ఈశ, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T04:52:12+05:30 IST