విభజన హామీల అమలులో వైఫల్యం
ABN , First Publish Date - 2021-01-12T05:47:01+05:30 IST
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్నారు.

మాజీ మంత్రి మూలింటి మారెప్ప
కర్నూలు(న్యూసిటీ), జనవరి 11: రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్నారు. సోమవారం సీ.క్యాంపులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారెప్ప మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కీం స్కామ్‌లా తయారైందన్నారు. కష్టపడే వారిని పార్టీ గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా రాష్ట్ర విభజన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. మాదిగలు ఐక్యంగా ముందుకు వస్తే దళితుల సొంత పార్టీని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సమావేశంలో సర్వజన ఐక్యవేదిక అధ్యక్షుడు పేరు పోగు లక్ష్మన్న, మీసాల సుమలత, మోహన్ పాల్గొన్నారు.