ఫేస్‌బుక్ ప్రేమాయణం
ABN , First Publish Date - 2021-01-20T05:36:47+05:30 IST
ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి బనగానపల్లె మండలానికి చెందిన యువకుడితో గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌లో పరిచయం ఉంది.

- కోవెలకుంట్లలో ప్రేమ జంట
- తెలంగాణ నుంచి వచ్చిన యువతి తల్లిదండ్రులు
కోవెలకుంట్ల, జనవరి 19: ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి బనగానపల్లె మండలానికి చెందిన యువకుడితో గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌లో పరిచయం ఉంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయం తెలిసి యువతికి ఓ వ్యక్తితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ప్రేమికుడు ఆ యువతిని కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. యువతి తల్లిదండ్రులు వచ్చారన్న సమాచారంతో ప్రేమ జంట బనగానపల్లె మండలం నుంచి కోవెలకుంట్లకు వెళ్లింది. దీంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు కూడా కోవెలకుంట్లకు వచ్చారు. యువతి, యువకుల కుటుంబాలు కోవెలకుంట్ల పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాయి. దీంతో ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి విచారించారు. వారివురు మేజర్లు కావడంతో ఇరువురు వివాహం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్‌ఐ తెలిపారు. యువతి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు గత సంవత్సరం చనిపోయాడని తెలిపారు. ఒక్కగానొక్క కూతురు మాత్రమే ఇలా రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.