రూ.5,69,400 లక్షల దోపిడీ

ABN , First Publish Date - 2021-05-30T06:16:11+05:30 IST

మండలంలోని నన్నూరు గ్రామ సమీపాన తెల్లవారుజామున గుర్తుతెలియన వ్యక్తులు ఓ లారీని ఆటకాయించి డ్రైవర్‌ వద్ద ఉన్న రూ.5,69,400 లక్షలను లాక్కొని వెళ్లిపోయారు.

రూ.5,69,400 లక్షల దోపిడీ

ఓర్వకల్లు, మే 29: మండలంలోని నన్నూరు గ్రామ సమీపాన తెల్లవారుజామున గుర్తుతెలియన వ్యక్తులు ఓ లారీని ఆటకాయించి డ్రైవర్‌ వద్ద ఉన్న రూ.5,69,400 లక్షలను లాక్కొని వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి వెంటనే ఎస్‌ఐ వెంకటేశ్వరరావు జిల్లా అధికారులకు సమాచారం చేరవేశారు. కర్నూలు డీఎస్పీ మహేష్‌, కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. నంద్యాలకు చెందిన లారీ డ్రైవర్‌ పాపయ్య కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌లో పత్తి లారీ అన్‌లోడ్‌ చేసి మిల్లు యజమాని నుంచి డబ్బులు తీసుకుని తడకనపల్లె మీదుగా నన్నూరుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు టాటా సుమోలో వచ్చి లారీని అటకాయించి డ్రైవర్‌ను బెదిరించి  రూ.5,69,400 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-05-30T06:16:11+05:30 IST