సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం: గౌరు

ABN , First Publish Date - 2021-12-08T05:01:31+05:30 IST

ప్రజల సమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు.

సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం: గౌరు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, డిసెంబరు 7: ప్రజల సమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు. కల్లూరు మండలం కె.మార్కాపురంలో మండల కన్వీనర్‌ రామాంజనేయులు అధ్యక్షతన మంగళవారం చేపట్టిన గౌరవ సభ-ప్రజా సమస్యల చర్చావేదిక కార్యక్రమానికి గౌరు చరిత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలను అధికార వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా.. వారిపై అధిక ధరల భారం  వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోజురోజుకూ  వైసీపీ ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోతోందన్నారు. టీడీపీ హయాంలో మంజూరైన పింఛన్లను అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో తొలగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ చేయూత పథకానికి అర్హులైన వారు సైతం రూ.18వేలు మంజూరైన వారికి వైసీపీకి ఓటు వేయలేదనే నెపంతో ఆ పథకం నుంచి దూరం చేస్తున్నారన్నారు. ఓటీఎస్‌) పేరుతో డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. ప్రజలెవరూ రూ.10వేలు కట్టవద్దని సూచించారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయిస్తామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకులు ధరల పెంచి ఇసుక, మద్యం, చెత్త పన్నులు వంటి ప్రజా వ్యతిరేక విదానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గౌరు చరిత ధ్వజమెత్తారు. టీడీపీ మండల సీనియర్‌ నాయకులు ఆర్‌.చంద్రకళాధర్‌ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు పాణ్యం గంగాధర్‌ గౌడు, కె.మధు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:01:31+05:30 IST