ఎన్నికల్లో సత్తా చూపండి

ABN , First Publish Date - 2021-02-01T06:03:42+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

ఎన్నికల్లో సత్తా చూపండి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

  1. పార్టీ తరపున అభ్యర్థులను గెలిపించుకోవాలి 
  2. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు బీసీ పిలుపు


బనగానపల్లె, జనవరి 31: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అవుకు మండలంలోని మంగంపేట, వేములపాడు బనగానపల్లె మండలంలోని యనకండ్ల, చెర్వుపల్లె, బనగానపల్లె, సంజామల మండలం కానాల, కోవెలకుంట్ల మండలంలోని సౌదరదిన్నె, తదితర గ్రామాల టీడీపీ నాయకులతో బీసీ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున సర్పంచ్‌ అభ్యర్థులు గెలుపొందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇసుక కొరత, మద్యంఽ దరల పెంపు, ఆటోవాలాలపై పెనాల్జీలు, డీజిల్‌ పెట్రోల్‌ ధరల పెంపుదల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిత్యం వాడే నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. గ్రామాల్లో ఒక్క అభివృద్ధి జరుగడం లేదన్నారు. టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జాహీద్‌హేస్సేన్‌, కానాల కేశవరెడ్డి, సుద్దగోపాల్‌రెడ్డి, సాంబశివారెడ్డి, తిమ్మారెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, ఫక్కీర్‌రెడ్డి, మద్దిలేటిరెడ్డి, బురానుద్దీన్‌, సలాం, కలాం, ఎల్లయ్య, గురప్ప తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T06:03:42+05:30 IST