చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-04-21T05:08:02+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం స్థానిక ఈశ్వర దేవాలయంలో బీసీ నాయకులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేయించారు.
ఆదోని టౌన్, ఏప్రిల్ 20: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం స్థానిక ఈశ్వర దేవాలయంలో బీసీ నాయకులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేయించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నాయకులు భద్రినాథ్, అమరయ్యస్వామి, చంద్రశేఖర్, వీరేష్‌బాబు 500 మందికి మాస్కులను పంపిణీ చేశారు.
పత్తికొండ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు మంగళవారం పత్తికొండలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ లోక్‌నాథ్ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు తిరుపాలు, బీటీ గోవింద్, శ్రీనివాసులుగౌడ్, బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు రంగస్వామి, సింగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మద్దికెర: టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని సర్పంచ్ కల్పన, టీడీపీ నాయకులు ఆకుల ఓబులేసు, నంది జయరాంఅన్నారు. మంగళవారం మండలంలోని యడవలి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్‌ను కట్‌చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమన్న, నంది ప్రసాద్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్యాపిలి: మండలంలోని అలేబాదుతండాలో మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బర్త్‌డే కేక్ కట్ చేసి పంపిణీ చేసుకున్నారు. నాయకులు గోపినాయక్, భీముడు నాయక్, మద్దిలేటి నాయక్, క్రిష్ణానాయక్, సోవ్లానాయక్, సాలమ్మభాయ్, సుతితభాయ్ పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఎమ్మిగనూరులోని టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ కొండయ్య చౌదరి కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రామదాసుగౌడ్, మిఠాయి నరసింహులు, హరిప్రసాద్‌రెడ్డి, ఫారుక్, కఠారి రాజేంద్ర, రంగన్న, రంగస్వామిగౌడ్, శ్రీనివాసులు, రామకృష్ణ, కృష్ణ, నందమూరి ఫ్యాన్స్ చంద్ర, రమేష్ పాల్గొన్నారు.
