ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-01-12T05:54:53+05:30 IST

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు నల్ల భాస్కర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలి
నగరంలో దీక్ష చేస్తున్న నాయకులు

  1. ఓసీ జేఏసీ డిమాండ్‌


కర్నూలు(న్యూసిటీ), జనవరి 11: రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు నల్ల భాస్కర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణదేవరాయల కూడలిలో రాష్ట్ర అధ్యక్షుడు బిర్రు ప్రతా్‌పరెడి అధ్యక్షతన ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఓసీ సామాజిక వర్గాలకు చెందిన దాదాపు 200 మంది దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 శాతం రిజర్వేషన్‌ అమలయ్యే వరకు పోరాడుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. రిజర్వేషన్‌ అమలు కాని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, టీడీపీ నంద్యాల లోక్‌సభ  నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కాంగ్రెస్‌ నాయకుడు లక్ష్మీనరసింహ యాదవ్‌, విద్యాసంస్థల అధినేతలు కేవీ సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, గోపీనాథ్‌, జనసేన నాయకులు సంఘీభావం ప్రకటించారు. 

Updated Date - 2021-01-12T05:54:53+05:30 IST