కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-01-12T05:41:26+05:30 IST

కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రామచంద్రయ్య, రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న పి.రామచంద్రయ్య

 సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం


కర్నూలు(న్యూసిటీ), జనవరి 11: కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రామచంద్రయ్య, రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో  జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన ఎస్టీయూ భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.  సీపీ ఎం, టీడీపీ, వివిధ రైతు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కాకుండా విశాఖపట్టణంలో కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలను కోవడం దారుణమని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి పాటుపడతానని చెప్పిన సీఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని సీమ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి  ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో జరుగు తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి లేకుండా చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు అరుణ్‌ అన్నారు.  అభివృద్ధి కేంద్రీకరణ అనే పాలక విధానంలో భాగంగానే కృష్ణా యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేస్తున్నారని విరసం నాయకుడు పాణి అన్నారు. ఈ సమావేశంలో మంగళవారం ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని,  18న అన్నినియోజవర్గాల్లో సమావేశాలు  నిర్వహించాలని తీర్మానించారు. ఈ  సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కే.రామాంజనేయులు, టీడీపీ నాయకుడు  సత్రం రామక్రిష్ణుడు  పాల్గొన్నారు.


కర్నూలు(ఎడ్యుకేషన్‌): కర్నూలు నగరంలోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ వీర పాండియన్‌కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాళింగి నరసింహవర్మ సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కృష్ణానదితో ఎలాంటి సంబంధంలేని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్టణంలో ఏర్పాటు చేయడాన్ని వారు వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసు కుని కర్నూలు నగరంలోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన వారిలో నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యులు సందడి సుధాకర్‌, బీజేపీ నాయకులు ఉమమహేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-12T05:41:26+05:30 IST