‘కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయండి’

ABN , First Publish Date - 2021-12-30T05:34:00+05:30 IST

ప్రతి గ్రామంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఖచ్చితంగా గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించాలని ఎంపీడీవో గీతావాణి, ఈవోపీఆర్‌డీ జనార్దన్‌ ఆదేశించారు.

‘కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయండి’

ఆదోని రూరల్‌, డిసెంబరు 29: ప్రతి గ్రామంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఖచ్చితంగా గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించాలని ఎంపీడీవో గీతావాణి, ఈవోపీఆర్‌డీ జనార్దన్‌ ఆదేశించారు. ఎంపీపీ భవన్‌లో బుధవారం రాత్రి పంచాయతీ, సచివాలయ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి వేగవంతం చేయాలని అన్నారు. ఈ నెల చివరిలోగా ఓటీఎస్‌ కార్యక్రమాన్ని కూడా ముగించాలని అన్నారు. ఏవో శేఖర్‌, కార్యదర్శులు విజయలక్ష్మి, చంద్రకళావతి బాయి, ఎస్‌.నాగమణి, యశోద లత, బ్రాహ్మిణి, మల్లికార్జున, సురేష్‌, ఓంప్రకాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:34:00+05:30 IST