కర్నూలులోనే ఏరువాక కేంద్రం

ABN , First Publish Date - 2021-12-25T05:35:10+05:30 IST

కర్నూలులోనే ఏరువాక కేంద్రం ఉండేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కర్నూలులోనే ఏరువాక కేంద్రం
మార్కెట్‌ యార్డులో ఏర్పాటైన ఏరువాక కేంద్రం

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 24: కర్నూలులోనే ఏరువాక కేంద్రం ఉండేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు క్షేత్రస్థాయిలో అందించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక సైంటిస్టు ఆధ్వర్యంలో ఏరువాక కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేశారు. అయితే వివిధ కారణాల వల్ల దీన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మిగనూరులోని బనవాసి పరిశోధన కేంద్రానికి తరలించారు. అయితే రైతుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని బనవాసిలోని ఏరువాక కేంద్రా న్ని కర్నూలు మార్కెట్‌ యార్డుకు తరలించారు. ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కో ఆర్డినేటర్‌గా రామక్రిష్ణారావును ప్రభుత్వం నియమించింది. 


తెగుళ్లు, కీటకాలు వ్యాపిస్తే సంప్రదించండి


ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు తెగుళ్లు, కీటకాలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం పత్తిలో గులాబి రంగు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరపలో తామర పురుగులు ఎక్కువగా ఉన్నాయి. రైతులు డీలర్లు, వ్యాపారుల మాటలను నమ్మి ఏదిపడితే అది పిచికారీ చేసి నష్టపోవద్దు. ఏరువాక కేంద్రంలో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తాం. 


- రామక్రిష్ణారావు, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌

Updated Date - 2021-12-25T05:35:10+05:30 IST