విద్యుత్‌ వైర్లు తగిలి వరిగడ్డి దగ్ధం

ABN , First Publish Date - 2021-12-31T05:45:02+05:30 IST

పట్టణ శివారులోని కోవెలకుంట్ల రోడ్డులో ఉన్న ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌ వద్ద బనగానపల్లె మండలం జోలాపురం రైతు జిలాన్‌కు చెందిన వరిగడ్డి ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి.

విద్యుత్‌ వైర్లు తగిలి వరిగడ్డి దగ్ధం

 బనగానపల్లె, డిసెంబరు 30: పట్టణ శివారులోని కోవెలకుంట్ల రోడ్డులో ఉన్న ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌ వద్ద బనగానపల్లె మండలం జోలాపురం  రైతు జిలాన్‌కు చెందిన  వరిగడ్డి ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి  మంటలు చెలరేగాయి. ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ట్రాక్టరుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, వరిగడ్డి దగ్ధమైందని రైతు జిలాన్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-31T05:45:02+05:30 IST