విద్యుత్ తీగలు తగిలి వరిగడ్డి దగ్ధం
ABN , First Publish Date - 2021-05-09T05:15:26+05:30 IST
కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి మంటలు వ్యాపించడంతో ట్రాక్టరులో ఉన్న వరిగడ్డి మొత్తం దగ్ధమైంది.

సంజామల,
మే 8: కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి మంటలు వ్యాపించడంతో
ట్రాక్టరులో ఉన్న వరిగడ్డి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదం సంజామలలో శనివారం
చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు యాలూరు సుబ్బరాయుడు తన పొలంలో ఉన్న
వరిగడ్డిని కల్లంలోకి చేర్చేందుకు ట్రాక్టర్లో తరలిస్తుండగా కోటవీధి
పీర్లచావిడి వద్ద కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి మంటలు
వ్యాపించాయి. వెంటనే రైతు ప్రమత్తమై వరిగడ్డిని ట్రాక్టరు నుంచి అన్లోడ్
చేశాడు. దీంతో ట్రాక్టర్కు నష్టం జరగలేదు. రూ.10వేల విలువ చేసే వరిగడ్డి
బూడిదైంది. పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా తోటి రైతులతో
కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ తీగలను సరిచేయాలని ఎన్నిసార్లు
ఫిర్యాదు చేసినా, ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు
వాపోతున్నారు.