డిగ్రీలో ఎనిమిది మంది డిబార్
ABN , First Publish Date - 2021-07-24T05:59:19+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 8 మంది విద్యార్థులను డిబార్ చేశామని పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్‌టీకే. నాయక్ తెలిపారు.

కర్నూలు(అర్బన్), జూలై 23: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 8 మంది విద్యార్థులను డిబార్ చేశామని పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్‌టీకే. నాయక్ తెలిపారు. శుక్రవారం రెండో రోజు 75 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు 20,734 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగ 18,680మంది హజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో శ్రీరామ డిగ్రీకాలేజీ, ఆళ్లగడ్డ-1, జీవీఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలే జీ, డోన్-3, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ, కోడుమూరు-1, విజయసాయి డిగ్రీ కాలేజీ, పత్తికొండ-1, జడ్పిహెచ్‌స్కూల్, మద్దికేర-2 మంది విద్యార్థులు పరీక్షల్లో మాల్ ప్రాక్టిసు చేస్తు పట్టు బడటంతో వారిని డిబార్ చేశామని తెలిపారు.