మానసిక వ్యాధికి అందుబాటులో ఈసీటీ చికిత్స
ABN , First Publish Date - 2021-10-22T05:27:53+05:30 IST
నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మానసిక వైద్య విభాగంలో మానసిక వ్యాధికి చికిత్స అందించే మోడీఫైడ్ ఈసీటీ (ఎలకో్ట్ర కన్వల్సివ్ థెరపీ) చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.విజయకుమార్ తెలిపారు.

- సూపరింటెండెంట్ డా.విజయకుమార్
నంద్యాల(నూనెపల్లె), అక్టోబరు 21: నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మానసిక వైద్య విభాగంలో మానసిక వ్యాధికి చికిత్స అందించే మోడీఫైడ్ ఈసీటీ (ఎలకో్ట్ర కన్వల్సివ్ థెరపీ) చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.విజయకుమార్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో ఆయన మాట్లాడుతూ మానసిక వైద్య విభాగంలో మొట్టమొదటిసారిగా మోడీఫైడ్ ఈసీటీ అనే కరెంట్ షాక్ థెరపీ ద్వారా తీవ్రమైన మానసిక వ్యాధికి చికిత్స అందించే ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన డిప్రెషన్, శైజోఫ్రీనియా, సైకోసిస్ షూసైడల్‌టెన్‌డెన్మా అనే వ్యాధులు మందుల ద్వారా నివారించలేని పక్షంలో ఈ కరెంట్ షాక్ థెరపీ ద్వారా వైద్య చికిత్స అందించనున్నట్లు చెప్పారు. ఇటీవలే మానసిక వ్యాధి అయిన శైజోఫ్రీనియాతో బాధపడుతూ కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తున్న వ్యాధిగ్రస్తుడిని ఆస్పత్రి వైద్యులు రవికుమార్, మహబూబ్‌బాషా, సిబ్బంది కరెంట్ షాక్ థెరపీ ద్వారా రోగి మానసిక స్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని సూపరింటెండెంట్ తెలిపారు.