‘ఇతర శాఖల బాధ్యతలు మాకు అప్పగించకండి’

ABN , First Publish Date - 2021-11-24T05:20:06+05:30 IST

ఇతర శాఖల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించరాదని మంగళవారం గోనెగండ్ల మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బైలుప్పల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తాటికొండ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

‘ఇతర శాఖల బాధ్యతలు మాకు అప్పగించకండి’

గోనెగండ్ల, నవంబరు 23: ఇతర శాఖల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించరాదని మంగళవారం గోనెగండ్ల మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బైలుప్పల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తాటికొండ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో నిరసన తెలియజేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల పంచాయతీ కార్యదర్శుల శాఖకు సంబంధం లేని ఇతర శాఖల పనులను కూడా కార్యదర్శులతో చేయిస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార ్యదర్శులకు తాగునీరు, పారిశుద్ధ్యపనులు, వీదిదీపాలు తో పాటు ఇంటి పన్న వసూలు తదితర పనులు ఉంటాయి వాటి పూర్తి చేయడం కష్టంగా ఉంటే ఇతర శాఖ లకు సంబంధించిన పనులు అప్పజెప్పి వాటి భారాన్ని పంచాయతీ కార్యదర్శుల పై రుద్దడం తగదన్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్‌, తోటయ్య, సుంకన్న, కృష్ణ, జనార్దన్‌ పంచాయతీ కార్యదర్శులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T05:20:06+05:30 IST