రైతుల ఆత్మహత్యలు పట్టవా..?

ABN , First Publish Date - 2022-01-01T05:21:42+05:30 IST

అతివృష్ఠి, అనావృష్ఠితో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతోంటే.. వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోట రాముడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల ఆత్మహత్యలు పట్టవా..?


డోన(రూరల్‌), డిసెంబరు 31: అతివృష్ఠి, అనావృష్ఠితో రైతులు తీవ్రంగా నష్టపోయి  అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతోంటే.. వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోట రాముడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డోన సబ్‌ డివిజన ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. 5న డోన తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు తెలిపారు. రైతుల కష్టాలపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  ధర్నా కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ హాజరవుతున్నట్లు తెలిపారు. రైతులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు పులిశేఖర్‌, ప్రభాకర్‌, బొంతిరాళ్ల గ్రామ సర్పంచ రవిమోహన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-01T05:21:42+05:30 IST