13న విజయవాడలో ధర్మదీక్ష

ABN , First Publish Date - 2021-12-09T05:29:00+05:30 IST

రాయలసీమ హక్కుల కోసం ధర్మ పోరాటం కొనసాగిస్తామని రాయలసీమ ప్రజాసంఘా ల సమన్వయ వేదిక కన్వీనర్‌ బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు.

13న విజయవాడలో ధర్మదీక్ష

  1. రాయలసీమ హక్కుల కోసం.. 
  2. ప్రజాసంఘాల సమన్వయ వేదిక 


నంద్యాల టౌన్‌, డిసెంబరు 8: రాయలసీమ హక్కుల కోసం ధర్మ పోరాటం కొనసాగిస్తామని రాయలసీమ ప్రజాసంఘా ల సమన్వయ వేదిక కన్వీనర్‌ బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం నిర్ధిష్టమైన డిమాండ్లతో ఈనెల 13న విజయవాడలో రాయలసీమ ధర్మదీక్షను చేపడుతున్నామన్నారు. నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాల యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి పట్ల పాలకులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారన్నారు. రాయలసీమ ధర్మదీక్ష పోరాటానికి అన్ని పార్టీలకు ఉత్తరాలు రాశామన్నారు. హైకోర్టుతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సాగునీటి ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్‌లో సవరణ చేయాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి రాజకీయ పార్టీలు తమ కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ధర్మదీక్షకు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలపాలన్నారు. 
Updated Date - 2021-12-09T05:29:00+05:30 IST