రూ.2వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళిక

ABN , First Publish Date - 2021-08-20T06:03:46+05:30 IST

మంత్రాలయం అభివృద్ధికి రూ.2వేల కోట్లతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు తెలిపారు.

రూ.2వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళిక

  1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భక్తుల సహకారంతో.. 
  2. ఆరాధనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు 
  3. మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు


మంత్రాలయం, ఆగస్టు 19: మంత్రాలయం అభివృద్ధికి రూ.2వేల కోట్లతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు తెలిపారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు, భక్తులు, మఠం సహకారం తీసుకుంటామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 21 నుంచి రాఘవేంద్రస్వామి 350వ సప్త ఆరాధనోత్సవాలను కొవిడ్‌ నిబంధనలు అనుసరించి నిర్వహిస్తామన్నారు. భక్తులకు టెస్టు చేసిన తర్వాతే క్యూలైన్‌లోకి పంపుతామని, భక్తులు కూడా కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఉత్సవాలను జయప్రదం చేసేందుకు భక్తులు సహకరించాలన్నారు. రాఘవేంద్రస్వామి బృందావనానికి 14 కేజీల బంగారుతో నూతన కవచాలను తయారు చేయించి సమర్పిస్తామన్నారు. మంత్రాలయంలో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి బెంగళూరుకు చెందిన భక్తుడు ముందుకు వచ్చారని, స్థలం పరిశీలీంచి తదుపరి ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు. తులసి వనం పక్కన భక్తుల కోసం భవ్యమైన హాల్‌ను నిర్మించామని, మఠం ముందు భాగంలో రోడ్డు విస్తరణ పనులను ముమ్మరం చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తుంగభద్ర నది వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. 

Updated Date - 2021-08-20T06:03:46+05:30 IST