దేవరగట్టులో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2021-04-05T05:36:49+05:30 IST
మండలంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హొళగుంద, ఏప్రిల్ 4: మండలంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి మల్లి కార్జునస్వామి మాట్లాడుతూ ప్రత్యేక పూజలైన జలాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆకుపూజను నిర్వహించినట్లు తెలిపారు. చుట్టుపక్క గ్రామాలతో పాటు కర్ణాటక ప్రాంత భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కు లు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.