భక్తుల పుణ్యస్నానాలకు నిరాకరణ

ABN , First Publish Date - 2021-11-22T05:20:47+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధనంలో ప్రవహిస్తున్న తుంగభద్రనది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది.

భక్తుల పుణ్యస్నానాలకు నిరాకరణ

మంత్రాలయం, నవంబరు 21: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధనంలో ప్రవహిస్తున్న తుంగభద్రనది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. హోస్పెట్‌ టీబీ డ్యాంనుంచి విడుదల చేసిన నీరు మంత్రాలయానికి చేరుతుండటంతో తుంగభద్రనది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు లక్షల క్యూసెక్కులు నీరు విడుదల కావటంతో ఆంధ్రకర్ణాటక రెండుసరిహద్దులను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తు పరవళ్లు తొక్కుతోంది. 309.250మీటర్ల నీటిమట్టంతో లక్ష 10వేల క్యీసెక్కుల పైగా నిండుగా ప్రవహిస్తుంది. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు పుణ్య స్నానాలకు పోలీసు అధికారులు నిరాకరించారు. నదిదగ్గర బారికేట్లను పెట్టి విఐపీ, పంప్‌హౌస్‌, గణేష్‌ఘాట్‌, శ్రీమఠం ఘాట్లాను బారికేట్ల ఏర్పటు చేసి భక్తుల రాకుండా అడ్డుకట్టవేశారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. స్నానం చేసేందుకు కొళాయిలు, షవర్లు వంటి ప్రత్యామ్నాయి ఏర్పాట్లు చేయకపోవటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ, శ్రీమఠం అధికారులు భక్తులు, ప్రజలను మైకులద్వారా అప్రమత్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-22T05:20:47+05:30 IST