డిగ్రీ పరీక్షలకు 16,555 మంది హాజరు

ABN , First Publish Date - 2021-08-28T05:10:24+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4,5 సెమిస్టర్‌ పరీక్షలకు శుక్రవారం 18,494 మంది విద్యార్థులకు గాను 16,555 మంది విద్యార్థులు హాజరయ్యారు.

డిగ్రీ పరీక్షలకు 16,555 మంది హాజరు

కర్నూలు(అర్బన్‌), ఆగస్టు 27: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4,5 సెమిస్టర్‌ పరీక్షలకు శుక్రవారం 18,494 మంది విద్యార్థులకు గాను 16,555 మంది విద్యార్థులు హాజరయ్యారు.  జిల్లాలోని 75 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.


 పీజీ పరీక్షలు..


రాయలసీమ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 3వ రోజు శుక్రవారం కొనసాగాయి. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 729 మంది విద్యార్థులకు గాను 674 మంది హాజరయ్యారు. 


 బీటెక్‌ పరీక్షలు..


రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాలలో 1,2,3 సెమిస్టర్‌ పరీక్షలు జరిగాయి. 233 మంది విద్యార్థులకు గాఆను 232 మంది హాజరయ్యారు.


Updated Date - 2021-08-28T05:10:24+05:30 IST