నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-30T05:47:59+05:30 IST

ఆంజనేయ ఫర్టిలైజర్స్‌ దుకాణంలో జరిగిన చోరీ కేసులో నిందితుడ్ని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

నిందితుడి అరెస్టు

పాణ్యం, డిసెంబరు 29: ఆంజనేయ ఫర్టిలైజర్స్‌ దుకాణంలో  జరిగిన చోరీ కేసులో నిందితుడ్ని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28  దుకాణంలో రూ.1.40 లక్షల దొంగతనం జరిగిందని  యజమాని ఏనుగుల ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు. దుకాణం ఎదురుగా ఉన్న   సీమార్ట్‌లోని సీసీ కెమెరాల ఆధారంగా కొండజూటూరుకు చెందిన పిక్కిలి శ్రీధర్‌,  మహేష్‌ అలియాస్‌ బొంబాయి నిందితులని గుర్తించారు.  వారిలో పిక్కిలి శ్రీధర్‌ను బుధవారం పాణ్యం డొంగు వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 40 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మైనరు  కావడంతో కర్నూలులోని బాల సదన్‌కు తరలించినట్లు తెలిపారు. మరో నిందితుడు మహే్‌షను అరెస్టు చేయాల్సి ఉందన్నారు.  Updated Date - 2021-12-30T05:47:59+05:30 IST