హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-09-19T05:31:46+05:30 IST

నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమ్మవారి శాల వీధిలో ఫొటో గ్రాఫర్‌ శ్రీధర్‌పై కత్తితో దాడిచేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

నంద్యాల(నూనెపల్లె), సెప్టెంబరు 18: నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమ్మవారి శాల వీధిలో ఫొటో గ్రాఫర్‌ శ్రీధర్‌పై కత్తితో దాడిచేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అమ్మవారి శాల వీధికి చెందిన శ్రీధర్‌ ఫొటోగ్రాఫర్‌గా జీవనం సాగించేవాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వెళ్తుండగా అమ్మవారి శాల వద్ద గొడవ జరుగుతుండటంతో వారించారు. దీంతో తెలుగు పేటకు చెందిన శ్రీహరి కత్తితో శ్రీధర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన శ్రీధర్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-09-19T05:31:46+05:30 IST