‘ఓటీఎస్‌తో రుణవిముక్తి’

ABN , First Publish Date - 2021-12-10T05:24:47+05:30 IST

వోటీఎస్‌ చెల్లించడం వల్ల లబ్ధిదారులు రుణ విముక్తులవుతారని హౌసింగ్‌ జేసీ నారపురెడ్డి మౌర్య తెలిపారు.

‘ఓటీఎస్‌తో రుణవిముక్తి’
ధ్రువపత్రాలు అందజేస్తున్న జేసీ నారపురెడ్డిమౌర్య

గడివేముల, డిసెంబరు 9: వోటీఎస్‌ చెల్లించడం వల్ల లబ్ధిదారులు రుణ విముక్తులవుతారని హౌసింగ్‌ జేసీ నారపురెడ్డి మౌర్య తెలిపారు. గురువారం ఆమె గడివేముల, పెసరవాయి గ్రామాల్లో వోటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించారు. జగనన్న శాశ్వత గృహ పథకంలో భాగంగా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద డబ్బులు చెల్లించిన వారికి ఈ నెల 21 తేదీ నుంచి ఇంటిపై శాశ్వత హక్కు పత్రాలను అందజేస్తారని అన్నారు. దీని వల్ల లబ్ధిదారులు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చని తెలిపారు. వోటీఎస్‌ వల్ల రుణ విముక్తితోపాటు రిజిస్ట్రే షన్‌ చేసి ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ సింహారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సుభాకర్‌, ఏపీఎం అంబమ్మ, పెసరవాయి సర్పంచ్‌ శేఖర్‌, పంచాయతీ కార్యదర్శులు నూరుల్లా, తారకేశ్వరి, రంగడు, వీఆర్వోలు సామన్న, హరింద్రలు పాల్గొన్నారు. 

- గడివేముల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆదినారాయణ అనారోగ్యంతో బుధవారం మృతి చెందడంతో అతడి కుమారుడైన రవివర్మకు వైఎస్సార్‌ బీమా పథకం కింద తక్షణ సహాయం రూ.10 వేలు హౌసింగ్‌ జేసీ నారపురెడ్డిమౌర్య అందజేశారు. మిగిలిన నగదును నామిని ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. 

రుద్రవరం: మండలంలోని తువ్వపల్లె గ్రామంలో గురువారం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌పై తహసీల్దార్‌ వెంకటశివ ప్రజలకు అవగాహ న కల్పించారు. ఇంటింటికి తిరిగి రూ.10 వేలు చెల్లిస్తే రుణ విముక్తి పత్రాలు అందజేస్తామని చెప్పారు. 

చాగలమర్రి: గ్రామాల్లోని గృహ నిర్మాణ లబ్ధిదారులు వోటీఎస్‌తో రుణ విముక్తి పొందాలని ఎంపీడీవో షేక్‌.షంషాద్‌బాను, హౌసింగ్‌ ఏఈ షఫీవుల్లా తెలిపారు. గురువారం చిన్నవంగలి, పెద్దవంగలి గ్రామాల్లో రూ.10 వేలు చెల్లించిన లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వోటీఎస్‌పై అవగాహన కల్పించారు. వోటీఎస్‌ ద్వారా రుణ విముక్తి పొందాలని సూచించారు.

గోస్పాడు: ప్రభుత్వ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పిం చాలని హౌసింగ్‌ డీఈ సత్యరాజ్‌ అన్నారు. గురువారం మండలం లోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై చాలా మంది దీనిపై అపోహలు పడుతున్నారని, అవగాహన కల్పించాలని సూచించారు. 

Updated Date - 2021-12-10T05:24:47+05:30 IST