నేటి నుంచి రాఘవుడి దర్శనం

ABN , First Publish Date - 2021-06-22T05:42:47+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కరోనా కేసులు ఉధృతి నేపథ్యంలో గత నెల 2నుంచి దర్శనం నిలిపివేశారు.

నేటి నుంచి రాఘవుడి దర్శనం

మంత్రాలయం, జూన్‌ 21: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కరోనా కేసులు ఉధృతి నేపథ్యంలో గత నెల 2నుంచి దర్శనం నిలిపివేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడడంతో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల సూచన మేరకు మంగళవారం నుంచి రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మఠం అధికారులు కోరారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. 

Updated Date - 2021-06-22T05:42:47+05:30 IST