ప్రమాదకరంగా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌

ABN , First Publish Date - 2021-12-31T05:21:38+05:30 IST

గోనెగండ్ల, ఐరన్‌బండకు తాగునీరు అందించే ఎస్‌ఎస్‌ట్యాంక్‌ ప్రమాదకరంగా మారిందని టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, ప్రధానకార్యదర్శి తిరుపతయ్య నాయుడు, సర్పంచ్‌ హైమావతి, రామాంజినేయులు, మాబువలి, అడ్వకేట్‌ చంద్ర శేఖర్‌, మదీనా అన్నారు.

ప్రమాదకరంగా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌

  1.  టీడీపీ నాయకులు పరిశీలన


గోనెగండ్ల, డిసెంబరు 30: గోనెగండ్ల, ఐరన్‌బండకు తాగునీరు అందించే ఎస్‌ఎస్‌ట్యాంక్‌ ప్రమాదకరంగా మారిందని టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, ప్రధానకార్యదర్శి తిరుపతయ్య నాయుడు, సర్పంచ్‌ హైమావతి, రామాంజినేయులు, మాబువలి, అడ్వకేట్‌ చంద్ర శేఖర్‌, మదీనా అన్నారు. గురువారం వారు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను పరిశీలించారు. ట్యాంక్‌ తూర్పువైపు కట్ట లీకేజీ అవుతోందన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు లోని అలల తాకిడి పెరగటంతో ట్యాంక్‌ కట్ట దెబ్బతింటోందన్నారు. అధికారులు వెంటనే కట్ట మరమ్మతు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే 10 నెలల క్రితం గ్రామానికి తాగునీటి కోసం పైప్‌లైన్‌ పనులు, మోటార్‌ కోసం రూ. 16 లక్షలతో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. 

Updated Date - 2021-12-31T05:21:38+05:30 IST