దెబ్బతిన్న మినుము పంట పరిశీలన

ABN , First Publish Date - 2021-12-10T05:28:59+05:30 IST

మండలంలోని శెట్టివీడు, గొడిగనూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మినుము పంటను సాగు చేసి నష్టపోయారు.

దెబ్బతిన్న మినుము పంట పరిశీలన
శెట్టివీడులో మినుము పంటను పరిశీలిస్తున్న నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు

చాగలమర్రి, డిసెంబరు 9: మండలంలోని శెట్టివీడు, గొడిగనూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మినుము పంటను సాగు చేసి నష్టపోయారు. దిగుబడి రాకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటను గురువారం నంద్యాల ప్రాంతీయ పరిశోదన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు కె.ప్రభాకర్‌, మంజూనాఽథ్‌, నరసింహులు, ఎన్‌ఎస్‌సీ విత్తనాల శాస్త్రవేత్తలు మోహన్‌, భీమరాయ, వేణుగోపాల్‌, ఏవో నహిదాబాను పరిశీలించారు. మినుము పంట దిగుబడి రాకపోవడంతో నష్టపోయామని రైతులు వారితో మొరపెట్టుకున్నారు. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు. కార్యక్రమంలో ఏఈవో నరసింహారావు, వీఏఏ ప్రసన్నకుమార్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 

రుద్రవరం, డిసెంబరు 9: మండలంలోని కొండమాయపల్లె, వెలగలపల్లె గ్రామాల సమీపంలో గురువారం వ్యవసాయాధి కారి ప్రసాదరావు మినుము పంటను పరిశీలించారు. మినుము పంటకు మరుక మచ్చల పురుగు ఆశించిందని తెలిపారు.  రైతులు మరక మచ్చ పురుగును పూత పురుగు అని కూడా అంటారని చెప్పారు. దీని వల్ల పూత రాలిపోయి పంట దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మినుము పంట పూత దశలో ఉందని అన్నారు. ఈ పురుగు నివారణకు తృబెండో మైండ్‌ 0.2 మిల్లీ లీటర్‌ లేదా రైనాక్సాపీర్‌ 0.3 ఎమిల్లీ లీటర్‌ లేదా నూనోల్యూరాన్‌ ఒక మీల్లీ లీటర్‌ లేదా టయోడి కార్బో ఒక గ్రాము ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేస్తే పూత పురుగు నివారించవచ్చని అన్నారు. 


Updated Date - 2021-12-10T05:28:59+05:30 IST