మహానందిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-01T04:42:21+05:30 IST

మహానంది క్షేత్రం ఆదివారం వేలాదిమంది భక్తులతో పోటెత్తింది. తెలుగు రాషా్ట్రల నుంచేగాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు దైవదర్శనం కోసం మహానందికి తరలి వచ్చారు.

మహానందిలో భక్తుల రద్దీ


మహానంది, అక్టోబరు 31: మహానంది క్షేత్రం ఆదివారం వేలాదిమంది భక్తులతో పోటెత్తింది. తెలుగు రాషా్ట్రల నుంచేగాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు దైవదర్శనం కోసం మహానందికి తరలి వచ్చారు. కరోనా వల్ల ఆలయం ప్రాంగణంలోని కోనేర్లలో పుణ్యస్నానాలకు అనుమతి లేకపోవడంతో భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం మహానందీశ్వరుడికి, కామేశ్వరిదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 


Updated Date - 2021-11-01T04:42:21+05:30 IST