‘చట్టాలపై అవగాహనతో నేరాలు అదుపు’

ABN , First Publish Date - 2021-12-31T05:25:18+05:30 IST

చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు తగ్గుతాయని మంత్రాలయం ఎస్‌ఐ వేణుగోపాల రాజు అన్నారు.

‘చట్టాలపై అవగాహనతో నేరాలు అదుపు’

మంత్రాలయం, డిసెంబరు 30: చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు తగ్గుతాయని మంత్రాలయం ఎస్‌ఐ వేణుగోపాల రాజు అన్నారు. మంత్రాలయం సచివాలయం -1లో సర్పంచ్‌ స్టీమర్‌ భీమా అధ్యక్షతన గురువారం రాత్రి పౌరహాక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, మహిళల రక్షణ చట్టం, ఇతర నేరాలు, శిక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ శశిశేఖర్‌ రావు, వైస్‌ సర్పంచ్‌ హోటల్‌ పరమేష్‌, వార్డు సభ్యులు రామాంజనేయులు, వీరయ్య శెట్టి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:25:18+05:30 IST