కొవిడ్ కేంద్రంలో ఆకలి కేకలు
ABN , First Publish Date - 2021-05-06T05:43:51+05:30 IST
నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న టిడ్కో గృహాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ వద్ద పరిస్థితి ఇది.
నంద్యాల
ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న టిడ్కో గృహాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్
సెంటర్ వద్ద పరిస్థితి ఇది. మంగళవారం జరిగిన ఈ ఘటనతో ఆలస్యంగా వెలుగులోకి
వచ్చింది. దాదాపు 1000 మంది బాధితులు ఇక్కడ ఉన్నారు. వీరికి సమయానికి ఆహారం
అందించడంలో జాప్యం జరుగుతోంది. దీనికితోడు బాధితుల సంఖ్యకు సరిపడా
అందడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు ఒకేచోట
ఉంచడంతో వాటిని తీసుకునేందుకు బాధితులందరూ ఇలా తోసుకున్నారు. మున్సిపల్
కమిషనర్ వెంకటకృష్ణ కొవిడ్ కేర్ సెంటర్కు వచ్చి బాధితులకు అసౌకర్యాలు
కలగకూడదని అధికారులను ఆదేశించారు.
- నంద్యాల (ఎడ్యుకేషన్)