కొవిడ్ నివారణ చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-03-22T04:59:50+05:30 IST
కొవిడ్ నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని శ్రీశైల దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులను ఈవో కేఎస్ రామరావు ఆదేశించారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామరావు
శ్రీశైలం,
మార్చి 21: కొవిడ్ నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని శ్రీశైల
దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులను ఈవో కేఎస్ రామరావు ఆదేశించారు.
దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, వైద్యులతో ఆయన ఆదివారం
టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్
తీసుకోవాలని సూచించారు. అందరూ మాస్కులను ధరించాలని, తరచూ చేతులు
శుభ్రపరచుకోవాలని, భౌతికదూరం పాటించాలని, విధిగా శానిటైజర్ ఉపయోగించాలని
సూచించారు. దర్శనం క్యూలైన్లు, అన్నదాన వితరణ, ప్రసాద విక్రయ కేంద్రాలు,
కళ్యాణకట్ట, వసతిగృహల వంటి ముఖ్యప్రదేశాలలో కొవిడ్ నిబంధనలను అమలు
చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట లెగ్ ఆపరేటెడ్ శానిటైజర్‌లను ఏర్పాటు
చేయాలని సూచించారు. క్షేత్ర పరిధిలో ఫ్లెక్సీలు, ప్రసార సాధనాల ద్వారా
భక్తులకు కొవిడ్ నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సోమశేఖర్ పాల్గొన్నారు.