శవం లభ్యం

ABN , First Publish Date - 2021-10-08T05:03:26+05:30 IST

పెద్దతుంబలం ఎల్లెల్సీ కాలువలో గత ఆదివారం గల్లంతైన రాజస్థాన్‌ యువకుడు వినోద్‌ మృతదేహం లభ్యమైంది.

శవం లభ్యం

ఆదోని రూరల్‌, అక్టోబరు 7: పెద్దతుంబలం ఎల్లెల్సీ కాలువలో గత ఆదివారం గల్లంతైన రాజస్థాన్‌ యువకుడు వినోద్‌ మృతదేహం లభ్యమైంది. అతను కుటుంబ పోషణ కోసం రాజస్థాన్‌ నుంచి వలస వచ్చి పెద్దతుంబలంలో ఉన్న జైన్‌ దేవాలయంలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. వినోద్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన సునీల్‌, భవాని గత ఆదివారం ఎల్లెల్సీ ప్రమాదంలో మృతి చెందారు. అదే రోజు రాత్రి సునీల్‌, భవాని మృతదేహాలు లభ్యమయ్యాయి. 5  ప్రమాద స్థలానికి 7 కి.మీ దూరంలో చిన్నకడబూరు వద్ద ఉన్న థైఫన్‌ బ్రిడ్జి దగ్గర గురువారం రాత్రి 6.30 గంటల సమయంలో వినోద్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలిచామని పెద్దతుంబలం ఎస్‌ఐ చంద్ర తెలిపారు. వినోద్‌కు భార్య, ముగ్గురు పిల్లులు ఉన్నారు. 

Updated Date - 2021-10-08T05:03:26+05:30 IST